రాజకీయాల్లోకి వస్తున్నట్లు జరుగుతున్న పుకార్లపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. రాజకీయాల్లోకి రమ్మని అడుగుతున్నారని, కానీ… తానే ఓ నిర్ణయం తీసుకోలేకపోతున్నానని అన్నారు. బలగం మూవీ టీమ్ విలేకరులతో మాట్లాడింది. ఈ సందర్భంగా దిల్ రాజు రాజకీయ అరంగేట్రంపై స్పందించారు. రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానాలు మాత్రం అందాయని, వెళ్లాలా? వద్దా? అన్న సందిగ్ధంలో పడిపోయానన్నారు.
సినీ పరిశ్రమలోనే తనను ఎవరైనా కామెంట్స్ చేస్తే తట్టుకోలేనని, అలాంటిది రాజకీయం అంతా విమర్శలతోనే వుంటుందని, అన్నింటికీ సిద్ధపడే వెళ్లాలన్నారు. అలా విమర్శలు ఎదుర్కోవడం తన వల్ల కాదన్నారు. దీనిని బట్టి రాజకీయాల్లోకి వెళ్తారా? అన్న ప్రశ్నకు సమాధానం వెతుక్కోవచ్చని పేర్కొన్నారు. తాము గ్రామాల్లో బలగం చిత్ర ప్రదర్శనలను ఆపుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదన్నారు. ప్రజలు ఏ రూపంలో సినిమాను చూసినా.. తమకు ఆనందేమనని చెప్పుకొచ్చారు.












