రష్మిక మందన, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, తెలుగు ప్రొడక్షన్ నెం. 2 ‘రెయిన్‌బో’ గ్రాండ్ గా ప్రారంభం

రష్మిక, దేవ్ మోహన్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘రెయిన్‌‌ బో” చిత్రాన్ని ప్రారంభించారు. క్కినేని అమల క్లాప్ కొట్టగా, నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచాన్ చేశారు. సురేష్ బాబు మూవీ టీమ్‌‌కి స్ర్కిప్ట్‌‌ను అందజేశారు. సందీప్ కిషన్, శరత్ మరార్, సుప్రియ, బాపి, వెంకీ కుడుముల, కె.కె.రాధా మోహన్, దామోదర్ ప్రసాద్ హాజరై బెస్ట్ విషెస్ అందించారు. రష్మిక మాట్లాడుతూ ‘ఇందులో నటించడం ప్రౌడ్‌‌గా ఫీలవుతున్నా. కథ విన్నప్పట్నుంచి ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూశా. ఈ ప్రాజెక్ట్‌‌పై చాలా ఎక్సయిటింగ్‌‌గా ఉన్నా’ అని చెప్పింది.

దేవ్ మోహన్ మాట్లాడుతూ ‘అమేజింగ్ స్ర్కిప్ట్‌‌. దర్శకుడు కథ చెప్పిన విధానంతో.. ఈ సినిమా కచ్చితంగా చేయాలనిపించింది’ అన్నాడు. బెస్ట్ ఎఫెర్ట్స్‌‌తో బెస్ట్ అవుట్‌‌పుట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అన్నాడు దర్శకుడు. ‘‘ఒకే ఒక జీవితం’ తర్వాత మేం చేయబోతున్న సినిమా ఇది. టీమ్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఏప్రిల్ 7 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత ఎస్.ఆర్. ప్రభు పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates