ఢిల్లీకి పవన్ కల్యాణ్… అమిత్ షా, నడ్డాతో భేటీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో పవన్ పలువురు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఏపీలో జరుగుతున్న పరిస్థితులు, రాజకీయ పరిస్థితులను చర్చించనున్నారు. అలాగే తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై వైసీపీ నేతలు చేసిన దాడి విషయం కూడా ప్రస్తావించనున్నారు.

 

ఇక… ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. ఇప్పటికే వీరి అపాయింట్ మెంట్లు కూడా ఖరారయ్యాయి. బీజేపీ, పవన్ మధ్య కాస్త దూరం పెరిగిందన్న వార్తల నేపథ్యంలో ఈ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్ని రోజుల కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లొచ్చారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు. ఈ పరిణామం జరిగిన కొన్ని రోజులకే పవన్ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Related Posts

Latest News Updates