తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి ఫైనల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ పరీక్షలు కొనసాగనున్నాయి. అయితే… మామూలుగా గత యేడాది 11 పేపర్లు వుండేవి. అయితే… ఈ సారి కేవలం 6 పేపర్లు మాత్రమే వుంటాయి. ఇక.. ఏపీలో ఎంసెట్ పరీక్షలకు ఎలాగైతే వుంటుందో ఒక నిమిషం ఆలస్యం నిబంధన వుంటుందని ప్రకటించారు. మొత్తం 6.64 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
ఇక.. తెలంగాణలో మాత్రం 5 నిమిషాల పాటు వెసులుబాటు ఇచ్చారు. 9:35 నిమిషాల వరకూ విద్యార్థులను పరీక్ష రాయడానికి అనుమతినిస్తామని ప్రకటించారు. మొత్తం 4.94 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం విద్యార్థుల్లో అబ్బాయిలు 2,43,852, అమ్మాయిలు 2,41,974 ఉన్నారు. అలాగే 3,78,794 మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాయనుండగా.. 98,726 మంది విద్యార్థులు తెలుగు మీడియంలో పరీక్ష రాయనున్నారు.