రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశంపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) కూడా స్పందించింది. అనర్హత వేటు తదనంతర పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. అయితే ఈ కేసు ఇంకా కోర్టులో ఉన్నందున ప్రస్తుతానికి వ్యాఖ్య లు చేయబోమని ఈయూ విదేశాంగ వ్యవహారాల ప్రధాన అధికార ప్రతినిధి పీటర్ స్టానో పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియ పరిణామాలను పరిశీలిస్తున్నామని, రాహుల్ గాంధీ అప్పీల్‌పై కోర్టు తీర్పు అనంతరం మాట్లాడుతామని తెలిపారు. ఇదే సమయంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా కీలకమైనదని, మన ప్రజాస్వామిక సమాజంలో బహుళత్వవాదం, భిన్న అభిప్రాయాలు, ఆలోచనలను చర్చించడం ముఖ్యమైన లక్షణాలు అని పేర్కొన్నారు.