రాహుల్ గాంధీపై మరో దావా

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మరొక్క పరువు నష్టం దావా దాఖలు అయింది. జనవరిలో భారత్ జోడో యాత్రలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)పై ఆయన చేసిన వ్యాఖ్యలకు ఈ కేసు దాఖలు అయింది. ప్రధాని మోడీపై వ్యాఖ్యల ఫలితంగా దాఖలు అయిన పరువు నష్టం దావా ఫలితంగా ఆయన ఎంపి పదవికి గండం ఏర్పడింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఈ కేసును రాహుల్‌పై న్యాయవాది అరుణ్ భదౌరియా దాఖలు చేశారు. ఈ ఏడాది జనవరి9వ తేదీన రాహుల్ గాంధీ హర్యానాలోని అంబాలాలో భారత్ జోడో యాత్రలో భాగంగా ఓ వీధికూడలి సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌పై చురకలకు దిగారు. కౌరవులు అంటే ఎవరు? ఇంతకు ముందటి కౌరవుల గురించి తను చెప్పడం లేదని, ఈ 21వ శతాబ్ధపు కౌరవుల గురించి చెపుతున్నానని పేర్కొంటూ వీరు ఖాకీ నిక్కర్లు వేసుకుంటారు. చేతుల్లో లాఠీలు పట్టుకుంటారు. శాఖలు నిర్వహిస్తుంటారని చెపుతూ, దేశంలోని ఇద్దరు ముగ్గురు బిలియనీర్లు ఈ కౌరవులకు అండదండలు అందిస్తారని వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై ఈ విధంగా ఆయన వాగ్బాణాలకు దిగారు. దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు ఈ న్యాయవాది దాఖలు చేసిన పరువు నష్టం దావాపై హరిద్వార్ కోర్టు ఈ నెల 12వ తేదీన విచారణ జరుపుతుంది.

మరోవైపు ‘దొంగలందరికీ మోదీ ఇంటిపేరు ఉంది’ అని రాహుల్‌ గాంధీ గతంలో విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో ఆయనను దోషిగా గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు గత నెలలో నిర్ధారించింది. రెండేళ్లు జైలు శిక్ష కూడా విధించింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ తన ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయారు.

Related Posts

Latest News Updates