హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఎంఎంటీఎస్ రెండో దశ రైళ్లు ప్రారంభం కానున్నాయి. మేడ్చల్- సికింద్రాబాద్, ఉందానగర్- మేడ్చల్- సికింద్రాబాద్- తెల్లాపూర్ వరకూ ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో దాదాపు 50 కిలోమీటర్ల మేర 10 నుంచి 15 రూపాయల టిక్కెట్ మాత్రం వుంటుంది. దీంతో అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ నెల 8 న ప్రధాని మోదీ రెండో దశను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సికింద్రాబాద్ రైల్వే ప్రకటించింది. మేడ్చల్- ఉందానగర్ మధ్య 55 కిలోమీటర్ల దూరం వుంటుంది దాదాపుగా. ప్రయాణించడానికి ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడు ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా కేవలం గంటలోనే చేరుకోవచ్చు.