తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులపై మళ్లీ భారం మోపింది. ఆర్టీసీ టిక్కెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఈ ధరలు కూడా అమలులోకి వచ్చాయి. జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను 5 శాతం పెంచడంతో ప్రయాణికులపై భారాన్ని మోపుతున్నట్లు ఆర్టీసీ పేర్కొంటోంది.

 

ఆర్టీసీ టిక్కెట్ లో వసూలు చేసే టోల్ ఛార్జీలను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. శనివారం ఉదయం నుంచే ఈ టోల్ ఛార్జీల వసూలు అమలులోకి వచ్చేసింది. దీని ఫలితంగా గరుడ ప్లస్ బస్సుల్లో 4 రూపాయల టోల్ ఛార్జీలు పెంచారు. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్లో 15 రూపాయలు పెంచారు. ఏసీ స్లీపర్ బస్సులో టోల్ ఛార్జీ కింద 20 రూపాయలు, టోల్ ప్లాజాల మీదుగా వెళ్లే సిటీ ఆర్డినరీ బస్సుల్లో 4 రూపాయలు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.