తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజనరీతో రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్నదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్రం సహకరించకున్నా తెలంగాణ ఆర్థికంగా అగ్రస్థానంలో నిలుస్తున్నదని ట్విట్టర్‌లో ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజనరీతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,000 మాత్రమే కానీ, సీఎం కేసీఆర్ పటిష్ట ఆర్థిక ప్రణాళికతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.3,17,000కు చేరుకుందని పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలోనే అత్యధికంగా 155 శాతం వృద్ధిరేటును నమోదు చేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
https://twitter.com/KTRBRS/status/1641701341742645250?s=20