హౌరా అల్లర్లు : పూర్తి నివేదిక సమర్పించాలని బెంగాల్ గవర్నర్ ని కోరిన కేంద్ర హోంశాఖ

శ్రీరామ నవమి సందర్భంగా బెంగాల్ హౌరాలో తీవ్ర హింస చెలరేగిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ స్పందించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ కి ఫోన్ చేశారు. అసలు ఏం జరిగిందో పూర్తిగా నివేదిక ఇవ్వాలని అమిత్ షా ఆదేశించారు. మరోవైపు అసలు క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకోవడానికి గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ అల్లర్లు జరిగిన ప్రదేశాల్లో కూడా పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఘర్షణలు జరిగిన ప్రాంతాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో కూడా బెంగాల్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇప్పటి వరకూ 36 మందిని అరెస్ట్ చేశారు. కాజీపారా, శివపూర్ ప్రాంతాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా హిందువు యువకులు ఏర్పాట్లలో నిమగ్నమై వుండగా…. కొందరు ముస్లిం యువకులు రాళ్లు రువ్వారు. దీంతో ఘర్షణ రేగింది.

 

దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నవమి సందర్భంగా భక్తులు, హిందువులు ఊరేగింపు ఉత్సవాలు కూడా నిర్వహించాయి. అయితే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ముస్లింలు అధిక జనాభా వున్న ప్రాంతాల్లో ఊరేగింపులపై రాళ్లు రువ్వడం జరిగింది. బెంగాల్ లోని హౌరా, గుజరాత్ వడోదరా, మహారాష్ట్రలోని శంభాజీ గనర్ లో ఘర్షణలు తలెత్తాయి. మొత్తం 22 మంది గాయపడగా… 56 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

బెంగాల్ లోని హౌరాలో నవమి సందర్భంగా ఊరేగింపు సమయంలో రాళ్లు రువ్వారు. దీంతో తీవ్ర ఘర్షణ జరిగింది. ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. దీనిపై బీజేపీ స్పందించింది. హిందువుల మనోభావాలను విస్మరిస్తూ.. సీఎం మమతా శ్రీరామ నవమి రోజు ధర్నా చేశారని, ముస్లిం ప్రాబల్యం వున్న ప్రాంతాలకు దూరంగా వుండాలని హిందువులను హెచ్చరించారని అన్నారు. ఆమె హిందువు అన్న విషయాన్నే మరిచిపోయిందని మండిపడ్డారు.

ఇక… గుజరాత్ లోని వడోదర ప్రాంతంలో రామ నవమి శోభాయాత్రపై రాళ్లు రువ్వారు. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మొదటి సంఘటన ఫతేపూరా ప్రాంతంలోని పంజ్రీగర్ లో జరగ్గా… కాసేపటికే కుంభర్ వాడా అనే ప్రాంతంలో హిందువులపై రాళ్లు రువ్వారు. అయితే… రాళ్లు రువ్విన 24 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇక… కర్నాటక లోని హసన్ ప్రాంతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. శ్రీరామ నవమి శోభాయాత్ర జరుగుతున్న సందర్భంలో తీవ్ర ఘర్షణ జరిగింది. అయితే ప్రస్తుతానికి వాతావరణం ప్రశాంతంగానే వుందని అధికారులు పేర్కొన్నారు.

ఇక.. మహారాష్ట్రలోని శంభాజీనగర్ లో కూడా ఘర్షణలు జరిగాయి. శ్రీరామ నవమి ఉత్సవం కోసం హిందువులు ఏర్పాట్లు చేస్తుండగా… కొందరు ముస్లిం యువకులు హిందువులపై రాళ్లు రువ్వారు. దీంతో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులపైనా అటాక్ చేశారు. ఆరు పోలీస్ వెహకల్స్​కు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులకు చెందిన 7 వాహనాలు ధ్వంసమయ్యాయి. పట్టణంలో ప్రఖ్యాత రామమదిరం ఉన్న కిరాద్ పురా ఏరియాలో ఈ ఘటన జరిగిందని, గొడవల్లో ఐదారు వందల మంది పాల్గొన్నారని స్థానిక పోలీస్ కమిషనర్ నిఖిల్ గుప్తా చెప్పారు.

Related Posts

Latest News Updates