టాలీవుడ్ యాక్టర్ రాంచరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, కోస్టార్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాంచరణ్ ప్రముఖ వ్యక్తి నుంచి ప్రత్యేకమైన శుభాకాంక్షలు అందుకున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టే ఉంటారు. రాంచరణ్ తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నుంచి విషెస్ అందుకున్నాడు. చిరంజీవి తన కుమారుడు రాంచరణ్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దాడుతున్న స్టిల్‌ను షేర్ చేస్తూ.. నిన్ను చూసి గర్వపడుతున్నా.. నాన్నా (రాంచరణ్). పుట్టినరోజు శుభాకాంక్షలు..అంటూ ట్వీట్ చేశాడు. తండ్రీ కొడుకుల అరుదైన స్టిల్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్సీ 15లో నటిస్తున్నాడు.
https://twitter.com/KChiruTweets/status/1640209525277102080?s=20













