సంసద్ రత్న అవార్డులను ప్రదానం చేసిన కేంద్ర ప్రభుత్వం

పార్లమెంట్ సభ్యులుగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం సంసద్ రత్న అవార్డులను ప్రదానం చేసింది. 2023 సంవత్సరానికిగానూ 13 మంది ఎంపీలు, రెండు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను సంసద్ రత్న, ఒక ఎంపీని లైఫ్ టైమ్ అచీవ్‍మెంట్ అవార్డుకు కేంద్రం ఎంపిక చేసింది.  న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. విజయసాయిరెడ్డితో పాటు రవాణా, పర్యాటకం, సాంస్కృతిక కమిటీ మాజీ ఛైర్మన్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కుడా దత్తాత్రేయ చేతుల మీదుగా సంసద్ రత్న అవార్డును అందుకున్నారు.  మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గౌరవార్థం 2010 నుంచి ప్రదానం చేస్తున్న ఈ అవార్డులను ఇప్పటివరకు 90 మంది పార్లమెంటేరియన్లు అందుకున్నారు.

Related Posts

Latest News Updates