విశాఖపట్నంలో కూలిన భవనం… ముగ్గురు దుర్మరణం

విశాఖపట్నంలోని పాత రామజోగిపేటలో ప్రమాదం జరిగింది. 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారందర్నీ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డుల్లో వారందరికీ అత్యవసర వైద్యం అందిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో సాకేటి అంజలి (14), దుర్గాప్రసాద్ (17) మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే… గురువారం ఉదయం మరో వ్యక్తి మరణించాడు.

ఇక… సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, రెవిన్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలను ప్రారంభించారు. కూలిన  భవంతిలో రెండు కుటుంబాలతో పాటు ఇద్దరు బ్యాచిలర్స్ నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. భవనం లో మొత్తం 9 మంది ఉన్నట్టు సమాచారం అందుతోంది. వారిలో వారిలో అంజలి చనిపోగా 6 గురిని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తారు. మరో ఇద్దరి కోసం రెస్క్యూ ఆపరేషన్‌ చేస్తున్నారు ఎన్టీఆర్ఎఫ్‌, ఫైర్ సిబ్బంది. కాగా నిన్న (మార్చి 23) అంజలి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం విశేషం. ఇంతలోనే ఈ దుర్ఘటన చేసుకుంది. దీంతో అంజలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Related Posts

Latest News Updates