రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ర‌వీంద్ర భార‌తిలో శోభ‌కృత్ ఉగాది వేడుక‌లుఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర మంత్రులు పంచాంగాన్నిఆవిష్క‌రించారు. భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో శోభకృత్ ఉగాది వేడుకలను కనుల పండువగా నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశు సంవర్డక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ భాను ప్రసాద్, సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, టీఎస్ఐడిసీ ఛైర్మన్ వేణుగోపాలచారి, డీజీపీ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పౌరాణిక విద్వాంసులు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా ఆయనను, తెలంగాణ పండితులను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది.