భారత చిత్ర పరిశ్రమలో విషాదం… సీనియర్ నటుడు సమీర్ ఖాకర్ కన్నుమూత

భారత చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. బాలీవుడ్ వెటరన్ యాక్టర్ సమీర్ ఖాకర్(71) కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న సమీర్…. నేటి ఉదయం 4:30 గంటలకు తుది శ్వాస విడిచాడని సోదరుడు గణేష్ ఖాకర్ ప్రకటించారు. శ్వాసకోశ సమస్యతో బాధపడుతుండటంతో ఆయనను కుటుంబీకులు ఈ నెల 14 న ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ నేడు మరణించాడు. 1980ల్లో దూర‌ద‌ర్శ‌న్ హిట్ షోలో పాపుల‌ర్ క్యారెక్ట‌ర్ ఖోప్దిగా పేరు పొందాడు.

నాలుగు ద‌శాబ్ధాలుగా స్టేజ్‌, ఫిల్మ్‌, టీవీ న‌టుడిగా స‌మీర్ క‌క్క‌ర్ రాణిస్తున్నారు. ఆయన చాలా కాలంగా న‌ట‌న‌కు దూరంగా 1996 నుంచి అమెరికాలో స్ధిర‌ప‌డ‌గా ఇటీవ‌ల దేశానికి తిరిగి వ‌చ్చారు.క‌క్క‌ర్ చివ‌రిసారిగా జై హో మూవీలో న‌టించ‌గా సంజీవ‌ని అనే టీవీ షోలోనూ క‌నిపించారు. గుజ‌రాతీ నాట‌కాల‌తో పేరొందిన స‌మీర్ క‌క్క‌ర్ టీవీ షో నుక్క‌డ్‌తో వెలుగులోకి వ‌చ్చారు. ఈ షోతో ఆయ‌న ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా స్ధిర‌ప‌డ్డారు. స‌ర్క‌స్‌, న‌యా నుక్క‌డ్‌, శ్రీమాన్ శ్రీమ‌తి, మ‌ణిరంజ‌న్‌, అదాల‌త్ వంటి టీవీ షోలు ఆయ‌న‌కు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.

Related Posts

Latest News Updates