RRR సినిమా, అందులోని నాటు నాటు పాట ఇప్పుడు ప్రపంచ మార్మోగుతోంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నాటు నాటు పాట ఆస్కార్ దక్కించుకుంది. దీంతో రాజమౌళి వేదిక మీదే ఎగిరి గంతేశారు. ఆస్కార్ దక్కడంతో తెలుగు సాహిత్యం, భారతీయ సినిమాకి విశ్వవ్యాపితమైన గుర్తింపు దక్కింది. దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా RRR టీమ్ కి అందరూ ప్రశంసించారు. రాజకీయ ప్రముఖులు, ఇండస్ట్రీ ప్రముఖులు కూడా శుభాభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేశారు.
https://twitter.com/alluarjun/status/1635505246284963843?s=20
అయితే… అల్లు అర్జున్ మాత్రం నేడు విషెస్ చేయడం గమనార్హం.ఇండియన్ సినిమాకు ఇది హృదయానికి హత్తుకునే సందర్భమంటూ ట్వీట్ చేశాడు. అలాగే రామ్ చరణ్ లవ్లీ బ్రదర్ అంటూ పొగిడాడు. ఎన్టీఆర్ అంటేనే తెలుగు ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. వారిద్దరూ తమ స్టెప్పులతో ప్రపంచమంతా డ్యాన్స్ చేసేలా చేశారని పోస్టులో చెప్పుకొచ్చాడు. ఇంత ఘన కీర్తికి కారణమైన రాజమౌళికి అభినందనలు తెలిపాడు అల్లు అర్జున్.













