రాష్ట్రంలో నవరత్నాలతో సంక్షేమ పాలన అందిస్తున్నాం : ఏపీ గవర్నర్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయాయి. సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. రాష్ట్రంలో నవరత్నాలతో సంక్షేమ పాలన అందుతోందన్నారు. నవరత్నాలతో ఏపీ ప్రజలకు డైరెక్టుగా నిధులు అందించామన్నారు. నాలుగేళ్లుగా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని చెప్పారు. జీఎస్‌డీపీలో దేశంలోనే ఏపీ టాప్ ప్లేస్లో ఉందని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రతి ఏటా 11.43 శాతం జీఎస్‌డీపీ వృద్దిరేటు సాధించిందని పేర్కొన్నారు. ఏపీలో తలసరి ఆదాయం రూ. 2.19 లక్షలకు పెరిగిందన్నారు.

రాష్ట్ర ఆర్ధికపరిస్థితి నాలుగేళ్లుగా మెరుగుపడిందని గవర్నర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు- నేడుతో పాఠశాలల ఆధునీకరణ చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం కింద తొలి విడతలో 3669 కోట్లతో 15,717, రెండో విడతలో 8,345 కోట్లతో 22,345 స్కూళ్లను అభివృద్ధి చేశారన్నారు. విశాఖ కేంద్రంగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు మొత్తం 13.42 లక్షల కోట్ల పెట్టుబడులకు 378 ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. 16 కీలక రంగాల్లో 6 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇంధన రంగంలో గణనీయమైన పెట్టుబడి రాబోతోందని, 9,57,112 కోట్ల పెట్టుబడులతో 1.80 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.

రాష్ట్రంలో 56 కొత్త బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేశాం.
ఎస్సీల కోసం 3, ఎస్టీల కోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 4 డిప్యూటీ సీఎం పోస్టులు.
జడ్పీ చైర్మన్ పోస్టుల్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇచ్చాం.
ప్రతి గ్రామ సచివాలయంలో ఆర్బీకే సెంటర్.
వ్యర్ధ రహిత, చెత్త రహిత గ్రామాలే లక్ష్యంగా ఏపీ ముందుకు సాగుతోంది.
స్వచ్ఛ సర్వేక్షణ్ లో ఏపీ ముందంజలో వుంది.
పాల ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానంలో వుంది.
వైద్యశాఖ ద్వారా 1.4 కోట్ల హెల్త్ కార్డులు.
పీహెచ్ సీలలో ఇద్దరు డాక్టర్లు వుండేలా చర్యలు.
వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్లు.
ప్రతి నెల ఒకటో తేదీన వైఎస్సార్ పింఛన్ కానుక.

 

వాలంటీర్ల ద్వారా ఇంటివద్దే పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని, 54నీటిపారుదల ప్రాజెక్టులలో 14 ప్రాజెక్టులను పూర్తి కాగా, 2 పాక్షికంగా పూర్తయ్యాయని గవర్నర్ పేర్కొన్నారు. రాబోయే 4 సంవత్సరాలలో దశల వారీగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని పేర్కొన్నారు. కాలువ పనులతో పాటుగా ప్రధాన డ్యామ్ లో 79.07 శాతం వరకూ పనులు పూర్తి చేశామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates