చెలియలికట్టను విశ్వసించే

సంస్కారం మీద నిలిచిన ధిక్కారం

ఆత్మ నిర్భీతి నుండి పుట్టిన

నిరంతర చలనశీలత

సంఘర్షణలోనూ సౌకుమార్యం

స్పందనలోనూ నిఖార్సుతనం

భారతీయతకూ, పడమటి మేలిమికీ చేరిపేసిన హద్దు

స్వేచ్చకూ, సంప్రదాయానికీ కుదిరిన దోస్తానం

ఆంధ్రంలోనూ ఆంగ్లంలోనూ

మాట ఒక మంత్రం

వేదికమీదా స్థూడియోలోనూ

తయారీ అక్కరలేని వక్తృత్వం

ఆమెకున్న సిరి, ఆమె పిఎస్టియు విరి

చెప్పని పాఠాలనూ, వినగలిగే ఛాత్రులున్న సారస్వతురాలు

కథనం, విమర్శ, అనువాదపు ఆస్తులున్న సిరిమంతురాలు

ఆమె మృణాళిని

నిత్య చైతన్యశీలి (2017)

కోమలి గాంధారం, ఇంతిహాసం వంటి వ్యంగ్యంతో పాఠకుల మీద తమదైన ముద్రవేసిన మా గురువు డా.సి.మృణాళిని మేడం, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్ గా, చరిత్రలో మొదటి మహిళా కన్వీనర్ గా ఎంపిక అయిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. అరుదైన అనువాదాలు, ఆంగ్లసాహిత్యంలో లోతైన అవగాహణతో తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు మృణాళిని మేడం. నా M.Phil, Ph.D  పరిశోధనలు గుర్రం జాషువా డిలాన్ థామస్ కవిత్వంలో బాల్యం, తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలుః ను వారు పర్యవేక్షించారు. నా క్రమశిక్షణ సమయపాలన లాంటి లక్షణాలను వారి నుండే అందిపుచ్చుకున్నాను. వారి సారధ్యంలో సాహిత్య అకాడమీ తెలుగు విభాగం విజయవంతంగా పనిచేస్తుందని ఆశిస్తూ…