నారా లోకేశ్ యువగళం పాదయాత్రకి బ్రేక్… మళ్లీ 14 నుంచి ప్రారంభం

టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు బ్రేక్ ఏర్పడింది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా అన్నమయ్య జిల్లా కంటేవారిపల్లి విడిది నుంచి లోకేశ్ వెళ్లిపోయారు. ఈ నెల 14 నుంచి మళ్లీ యువగళం పాదయాత్రను లోకేశ్ ప్రారంభిస్తారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం కాటేవారిపల్లి నుంచి పాదయాత్ర కొనసాగనుంది. అయితే… రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు ముందే నిర్ణయం తీసుకున్నానని, అందుకే తనకు మినహాయింపునిస్తూ… కంటేవారిపల్లి విడిది కేంద్రంలో వుండేందుకు అనుమతి ఇవ్వాలని లోకేశ్ కోరగా… ఎన్నికల సంఘం తిరస్కరించింది.

 

ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం కాటేవారిపల్లి నుంచి పాదయాత్ర కొనసాగనుంది. నియోజవర్గ ఓటర్లు మాత్రమే ఇక్కడ ఉండాలని స్థానికేతరులు ఇక్కడ ఉండకూడదని ఆదేశించారు. దీంతో కంటేవారి పల్లిని వీడి… లోకేశ్ హైదరాబాద్ కి పయనమయ్యారు. ఎన్నికల సమయంలో స్థానికేతరులు ఎన్నికలు జరిగే ప్రాంతంలో వుండొద్దన్న సంప్రదాయం ఎప్పటి నుంచో వస్తోందని అధికారులు పేర్కొన్నారు. దీంతో అధికారుల నిర్ణయాన్ని గౌరవిస్తూ నారా లోకేశ్ కంటేవారి పల్లి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.

Related Posts

Latest News Updates