మంత్రి కేటీఆర్ హఠాత్తుగా ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. శనివారం ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు నైతిక మద్దతు ఇవ్వడానికే కేటీఆర్ ఢిల్లీ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. మరో 2 రోజుల పాటు కేటీఆర్ ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. అయితే… పార్టీకి చెందిన లీగల్ టీమ్ తో కేటీఆర్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా… నేడో రేపో కవిత అరెస్ట్ అవుతారట… చేస్తే చేయనివ్వండి… ఏం చేస్తారో చూద్దామంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఈ విషయం సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ ఢిల్లీ బయల్దేరి వెళ్లడం హాట్ టాపిక్ గా మారిపోయింది.

 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై మొదటిసారిగా స్పందించారు. తెలంగాణ భవన్ లో నేడు BRS విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.కవితను నేడో రేపో అరెస్ట్ చేస్తారట… చేయనివ్వండి… ఏం చేస్తారో చూద్దాం. భయపడే ప్రసక్తి మాత్రం లేదు. అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మంత్రులు, ఎంపీల నుంచి కవిత వరకూ వచ్చారని, నోటీసుల పేరుతో నేతలందర్నీ వేధిస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రంపై తమ పోరాటం మాత్రం కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. బీజేపీని గద్దె దించే వరకు విశ్రమించొద్దు అని నేతలకు సీఎం కేసీఆర్ సూచించారు.