మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు దినం ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు తెలియజేస్తూ ఆదివారం (మార్చి 5) కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ మహిళా దినోత్సవం నాడు సెలవు వర్తిస్తుంది. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళలందరికీ స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెల్పింది. మహిళా ఉద్యోగులకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం ఈ మేరకు ఆదేశించింది.

 

మరోవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఆరోగ్య మహిళ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.మహిళల సమగ్ర అరోగ్య పరిరక్షణ కోసం సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు వైద్యారోగ్యశాఖ సమగ్ర ప్ర ణాళిక సిద్ధం చేసిందని చెప్పారు. పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, బస్తీ దవాఖానల్లో ప్రతి మంగళవారం ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేస్తామని తెలిపారు. మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందిస్తామ ని వివరించారు. మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక క్లినిక్‌లు ప్రారంభిస్తామని వెల్లడించారు. వీటిని 1200కు విస్తరించాలని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. వైద్య పరీక్షలపై ప్రత్యే క యాప్‌ ద్వారా మానిటరింగ్‌ చేస్తామని తెలిపారు.