ప్రాజెక్టు కె షూట్ లో గాయపడ్డ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ గాయపడ్డారు. ప్రాజెక్టు కె షూట్ లో భాగంగా హైదరాబాద్ లో ఆయనకు దెబ్బలు తగిలాయి. ఈ విషయాన్ని ఆయనే తన బ్లాక్ ద్వారా తెలియజేశారు. గాయం అవడంతో షూటింగ్ లన్నీంటినీ క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ప్రకటించారు. గాయాల కారణంగానే అభిమానులను కూడా కలవలేకపోతున్నానని పేర్కొన్నారు. అయితే 2 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని అమితాబ్ కి వైద్యులు సూచించారు.

 

“ప్రాజెక్ట్ కే కి సంబంధించి ఓ యాక్షన్ సంబంధించి షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో బిగ్‌బీ పక్కటెముకలకి గాయాలయ్యాయి. మూవీ టీం వెంటనే గచ్చిబౌలిలోని ఎఐజీ హాస్పిటల్‌కి తరలించింది. చికిత్స అనంతరం ఆయన ముంబై వెళ్లిపోయారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఇంట్లోనే అమితాబ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. చాలా పెయిన్ ఉందంటూ బాధని వ్యక్తం చేశారు.

 

ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రాజెక్ట్‌-K సినిమాకు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే 70శాతం షూటింగ్‌ కూడా పూర్తయింది. సై-ఫై జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినీదత్‌ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.

 

Related Posts

Latest News Updates