దిల్ రాజుగారిని అబాసు పాలు చేయవద్దు.. చిల్లర ప్రయత్నాలు మానుకోండి – ‘బలగం’ వివాదంపై వేణు ఎల్దండి

తెలంగాణ సంస్కృతి, సాంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబిస్తూ రూపొందిన చిత్రం ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీధర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వంలో హ‌ర్షిత్‌, హ‌న్షిత నిర్మించిన ఈ చిత్రం మార్చి 3న థియేట‌ర్స్‌లో విడుద‌లైంది. స‌క్సెస్‌ఫుల్ టాక్‌తో మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుంటుంది. ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల‌ను సైతం సినిమా ఆక‌ట్టుకుంటోంది. మ‌నంద‌రి జీవితాల్లో జ‌రిగిన , మ‌నం చూసిన ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని మ‌నిషికి బందాలే గొప్ప బ‌లం.. బ‌ల‌గం అనే చాటి చెప్పేలా సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమా క‌థ నాదంటూ జ‌ర్న‌లిస్ట్ గ‌డ్డం స‌తీష్ అనే వ్య‌క్తి మీడియా ముందు ఆరోప‌ణ‌లు చేశారు.  ఈ వ్య‌వ‌హారంపై చిత్ర ద‌ర్శ‌కుడు వేణు ఎల్దండి మాట్లాడుతూ

‘‘మాది చాలా పెద్ద ఫ్యామిలీ. మా నాన్న‌తో క‌లిపి ఆరుగురు. మానాన్నే అందులో చిన్న‌వాడు. అలాగే నాకు ముగ్గురు మేన‌త్త‌లు, ముగ్గురు పెద్ద‌మ్మ‌లు, ముగ్గురు మేన‌మామ‌లు.. మా క‌జిన్స్‌తో స‌హా  మా ఫ్యామిలీ అంతా క‌లిస్తే 100కి పైగానే ఉంటాం. తెలంగాణ‌లో పెళ్లైనా, చావైనా పండ‌గే. మా నాన్నగారు చ‌నిపోయిన‌ప్పుడు ఈ వంద మంది వ‌చ్చారు. చేదు నోరు అనే కాన్సెప్ట్ తెలంగాణ‌లో ఉంటుంది. ఎందుంక‌టే బాధ‌ల్లో ఉన్న‌వాళ్ల‌కు ఇంత మందు తాపించి వారి బాధ‌ను పంచుకుంటామ‌నేది కాన్సెప్ట్‌. ఇది తెలంగాణ సంస్కృతిలో భాగం. అప్పుడు నాకు 18-19 ఏళ్లు ఉంటాయి. చ‌నిపోయిన వ్య‌క్తి చుట్టూ జ‌రుగుతున్న విష‌యాన‌ల‌ను చూడ‌గానే నాకొక కొత్త ప్ర‌పంచం క‌నిపించింది. చావులో ఇన్ని ఎమోష‌న్స్ ఉన్నాయా? అని అనిపించింది. అప్ప‌టి నుంచి నా మైండ్‌లో వ��

Related Posts

Latest News Updates