తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్యక్షతన ప్రగతిభవన్లో ఈ సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలోనే పలు కీలక అంశాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల బడ్జెట్ ఆమోదం కోసం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్రప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు అదే రోజు ఆమోదముద్ర వేసింది. అయితే, మరిన్ని అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది.