భారత్-అమెరికా మధ్య సంబంధాలు బలోపేతం … ఆంటోని బ్లింకెన్

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ ఢిల్లి  వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఇక్కడ జరుగుతున్న జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి వచ్చిన ఆయన  ఆటో ఎక్కి, రాజధాని వీధుల్లో సంచరించారు. అమెరికా బయలుదేరే ముందు ఆయన ఆటోలో చక్కర్లు కొట్టారు. మలాసా టీ రుచిని ఆస్వాదించారు. తనకు స్వాగతం పలికిన చిన్నారులతో కొద్దిసేపు సరదాగా ముచ్చడించారు. పర్యటనలో మసాలా ఛాయ్‌ని రుచి చూడడం సహా ప్రతిభావంతులైన మహళలతో సమావేశమయ్యాయని పేర్కొన్నారు. సమయం దొరికితే తాను ఎక్కువగా భారత్‌లోనే కాలం గడపడడానికి ఇష్టపడతానని పేర్కొన్నారు. ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌,  చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయాల సిబ్బందిని, వారి కుటుంబాలను కలిశారు. ఈ సందర్భంగా భారత్‌-అమెరికా మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న సిబ్బందిని ప్రశంసించారు.   బ్లింకెన్‌ జీ20 సమావేశాల అనంతరం క్వాడ్‌ సభ్యదేశాలైన భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వీరితో కలిసి చైనాను కట్టడి చేసేందుకు అమలు చేయాల్సిన వ్యూహాలను చర్చించినట్లు సమాచారం. తన పర్యటన ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో సంరక్షిచడంలో అమెరికా, భారత్‌ నిబద్ధతకు అద్దంపడుతోండని బ్లింకెన్‌ పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates