మంచువారి ఇంట పెళ్లి సందడి… కాబోయే వైఫ్ ఫొటోని షేర్ చేసిన మంచు మనోజ్

మంచు వారి ఇంట పెండ్లి సందడి మొదలైంది. మంచు మనోజ్‌ రెండో పెండ్లికి రెడీ అయ్యాడు. అందరూ అనుకున్నట్లుగానే భూమా మౌనిక రెడ్డిని మనోజ్‌ వివాహమాడబోతున్నాడు. ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధువుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటవుతున్నారు. వివాహ వేడుకలో భాగంగా భూమా మౌనిక రెడ్డి ఫొటోను మొదటి సారి మంచు మనోజ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘మనోజ్‌ మంచు పెండ్లి కూతురు భూమా మౌనిక (లవ్‌ సింబల్‌). మనోజ్‌ వెడ్స్‌ మౌనిక’ అంటూ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పిక్‌ తెగ వైరల్‌ అవుతోంది.

https://twitter.com/HeroManoj1/status/1631511674640543750?s=20

అయితే మంచు మనోజ్ కి ప్రణతీ రెడ్డితో 2015 లోనే వివాహం అయ్యింది. పరస్పర అంగీకారంతోనే 2019 లో వీరిద్దరూ విడిపోయారు. దీంతో రెండో పెళ్లి చేసుకోవాలని కుటుంబీకులు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భూమా మౌనికా రెడ్డిని మంచు మనోజ్ వివాహం చేసుకుంటున్నాడు.

Related Posts

Latest News Updates