ఖుష్బూని ప్రశంసిస్తూ ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

బీజేపీ నేత, సీనియర్ నటి ఖష్బూకి మెగాస్టార్ చిరంజీవి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ సందర్భంలోనే చిరంజీవి కంగ్రాట్స్ తెలియజేశారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఎంపికైనా సందర్భంగా ఖుష్భూపై ప్రశంసలు కురిపించారు చిరు. “జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన ఖుష్భూకు నా శుభాకాంక్షలు. మీరు ఖచ్చితంగా ఈ పదవికి అర్హులు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా మీరు మహిళలకు సంబంధించిన అన్ని సమస్యలపై మరింత దృష్టి సారిస్తూ.. సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. మహిళా సమస్యలపై పోరాడుతున్న మీ గొంతుక మరింత శక్తివంతగా మారుతుంది” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

 

Related Posts

Latest News Updates