ఈడబ్ల్యూస్ వర్గాలకు తీపి కబురు

ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూస్‌)కు చెందిన నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈడబ్ల్యూస్‌ వర్గాల గరిష్ట వయో పరిమితిని అయిదేళ్లు పెంచింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 34 ఏళ్ళ గరిష్ట వయో పరిమితిని 39 ఏళ్లకు పెంపుదల చేసింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర సబార్డినేట్‌ సర్వీస్‌ నిబంధనలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు ఈడబ్ల్యూస్‌ వర్గాలు కూడా 39 ఏళ్ల గరిష్ట వయో పరిమితి ప్రయోజనాలను పొందనున్నారు.

Related Posts

Latest News Updates