కేసులకు భయపడను.. అన్నీ ఊహించే అడుగులు వేశా : కోటంరెడ్డి

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మళ్లీ పార్టీపై మండిపడ్డారు. తనపై కేసులు పెట్టి జైళ్లలో వేస్తారా? ఎన్నైనా పెట్టుకోండి. భయపడేదే లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడబోనన్నారు. నియోజకవర్గంలో రోడ్లు ఆధ్వాన్నంగా ఉన్నాయన్నారు. డ్రైన్‌లు లేవని.. విద్యుత్ సరిగా లేదన్నారు. నెల్లూరు రూరల్ లో ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పొట్టేపాలెం కలుజు నిర్మాణం చేయాలని, రోజూ వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నారని వివరించారు. వరదల సమయంలో సీఎం జగన్ కూడా ఈ ప్రాంతానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారని, వంతెన నిర్మాణంతో పాటు రహదారుల కోసం 27 కట్లు ఇస్తామని హామీ ఇచ్చినట్లు కోటంరెడ్డి గుర్తు చేశారు.

 

 

ఏడాదిన్నర గడిచినా… ఇంకా అమలు కావడం లేదని, నాలుగేళ్ల నుంచి పోరాడుతూనే వున్నానని వివరించారు. ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదని మండిపడ్డారు. కొమ్మరపూడి రైతులకి పరిహారం ఇవ్వాలని 50 సార్లు అడిగినా ఫలితం లేదన్నారు. బీసీ భవన్, అంబేద్కర్ భవన్ నిర్మాణం చేయాలని, స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరానన్నారు. ప్రశ్నిసై ఫోన్ ట్యాప్ చేశారని. నమ్మకం లేని చోట అనుమానించిన చోట ఉండకూడదని అనుకున్నానని కోటంరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మొదటి నుంచీ జగన్ కి అండగా వున్నానని, ప్రజా సమస్యలు ప్రశ్నిస్తే తన ఫోన్ ను ట్యాపింగ్ లో పెట్టారని ఆగ్రహ వ్యక్తం చేశారు. చివరికి టిక్కెట్ ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి అని కొందరు అన్నారని, అన్నీ నిర్ణయించుకునే అడుగులు వేశానని ప్రకటించారు.

Related Posts

Latest News Updates