ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ గత కొంత కాలంగా ‘RSS’పై సినిమా చేసేందుకు సిద్ధమైనట్లుతెగ వార్తలు వస్తున్నాయి. తాజాగా దర్శకుడు రాజమౌళి ‘RSS’ సినిమా స్క్రిప్ట్ చదివి కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో లహరి మ్యూజిక్ రికార్డింగ్ కంపెనీ డైరెక్టర్ లహరి వేలు సంచలన ఆరోపణలు చేశారు. దర్శకుడు రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ‘RSS’ సినిమాను హైజాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
2018లో ‘బాహుబలి-‘2 విడుదలైన తర్వాత ‘RSS’పై సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు నేను చెన్నైలో ఉన్నాను. నేను RSS సభ్యుడిని కూడా. RSSపై వస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం చెప్పే సినిమా తీయాలి అనుకుంటున్నట్లు విజయేంద్ర ప్రసాద్ తో చెప్పాను. నాలుగేళ్ల క్రితం విజయేంద్ర ప్రసాద్‌కి ఫోన్ చేసి స్క్రిప్ట్ రాయడానికి ఆసక్తి ఉందా? అని అడిగాను. అయితే, తనకు ఆ సంస్థ గురించి తెలియదని, ప్రాజెక్ట్ గురించి చర్చించడానికి హైదరాబాద్‌లో తనను కలవమని చెప్పారు. ఆయను కలవక ముందే సినిమా టైటిల్‌ని రిజిస్టర్ చేశాను. మా ఇంటరాక్షన్ తర్వాత విజయేంద్ర ప్రసాద్ థ్రిల్ అయ్యి రైటర్‌గా ఓకే చెప్పారు” అని వేలు తెలిపారు.
రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ ‘RSS’ సినిమా గురించి మాట్లాడేటప్పుడు తన పేరు చెప్పకపోవడం బాధ కలిగించిందని వేలు ఆవేదన వ్యక్తం చేశారు.‘RSS’ సినిమా కోసం తాను హైదరాబాద్‌లో ఒక కార్యాలయాన్ని ప్రారంభించానని, స్క్రిప్ట్ పై పని చేయడానికి 15 మంది రచయితలకు నిధులు సమకూర్చానునని లహరి వేలు పేర్కొన్నారు.