వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి సంబంధం లేదు : సజ్జల

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి సంబంధం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల పేర్కొన్నారు. అవినాష్ రెడ్డికి సంబంధం వున్నట్లు ఎలాంట ఆధారాలూ లేవన్నారు. ఎన్నికల ముందు వివేకా హత్య కేసు ద్వారా తమ నాయకుడ్ని నైతికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డికి సంబంధాలున్నట్లు ఆధారాలున్నాయని పేర్కొన్నారు. వివేకా హత్యకు ముందు సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంట్లో వున్నారనేది అబద్ధమని, అందుకు పక్కా ఆధారలే వుంటే గతంలో సిట్ విచారణల్లో బయటికి వచ్చేది కదా అని అన్నారు. గూగుల్ టేకౌట్ అంటూ చంద్రబాబు కొత్తగా మాట్లాడుతున్నారని, భౌగోళికంగా చూస్తే సీఎం జగన్, వైఎస్ వివేకా, భాస్కర్ రెడ్డి నివాసాలు దగ్గర దగ్గనే సుమారు 100 మీటర్ల దూరంలో వుంటాయన్నారు. గూగుల్ టేకౌట్ లో ఏ చూపిస్తుందో తెలియదని, సునల్ ఎక్కడున్నాడ తెలియదన్నారు.

 

సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై సీబీఐ దాఖలు చేసిన కౌంటర్లో అసలు విషయాలను వదిలేసి వారు విచారించిన వారి వాంగ్మూలాలు మార్చి కేసును ఓ వైపుగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తన్నారని మండిపడ్డారు. వివేకాను కోల్పోవడం వైసీపీకి, జగన్ కి నష్టమేనన్నారు. వివేకా తిరిగి పార్టీలోకి వస్తానంటే ఆహ్వానించింది కూడా జగనే అని గుర్తు చేశారు. వివేకా హత్య కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని, కొందరిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారని సజ్జల ఆరోపించారు.

 

చంద్రబాబు హయాంలో నుంచి జరిగిన పరిణామాలను సీబీఐ విచారణ లో తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలి నుంచి సిట్ చేసిన విచారణను సీబీఐ కట్టకట్టి పక్కన పెట్టిందని విమర్శించారు. వివేకా హత్య జరిగినప్పటి నుంచి సిట్ జరిపిన విచారణను తీసుకోవడం లేదన్నారు. హత్య చేసినట్లు చెబుతున్న వారంతా వివేకాతో పాటు దశాబ్దాలుగా ఉన్నవారే అని చెప్పుకొచ్చారు.

Related Posts

Latest News Updates