నరేంద్ర మోదీ రాసిన Exam Warriors పుస్తకం స్కూళ్ల లైబర్రీలో వుంచాలి : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

ప్రధాని నరేంద్ర మోదీ రాసిన Exam Warriors అనే పుస్తకం దేశంలోని అన్ని పాఠశాలల లైబ్రరీలలో వుంచాని కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర శిక్ష’ కింద ప్రతి పాఠశాలలోని లైబ్రరీలలో ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకాలను అందుబాటులో ఉంచాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల (UTs) నిర్వాహకులకు కేంద్రం సూచించింది. తద్వారా గరిష్ట సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ప్రయోజనం పొందుతారని వివరించింది.

 

ఈ పుస్తకంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల కోసం పరీక్షా ఒత్తిడిని అధిగమించే మార్గాలు, మంత్రాలను ప్రధాని మోదీ ఇందులో సూచించారు. నేషనల్ బుక్ ట్రస్ట్ 11 భారతీయ భాషలలో, అసామియా, బంగ్లా, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు మరియు ఉర్దూ భాషలలో పరీక్షా యోధుల అనువాదాలను ప్రచురించింది.

Related Posts

Latest News Updates