ఆరేళ్లు వస్తేనే పిల్లలకు స్కూల్ అడ్మిషన్… కేంద్రం కొత్త నిబంధన

విద్యార్థుల అడ్మిషన్లపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. విద్యార్థులకు 6 సంవత్సరాల వయస్సు వుంటేనే… ఒకటో తరగతి అడ్మిషన్ కి ఒకే చెప్పాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం పునాది దశలో పిల్లలందిరీ జాతీయ విద్యావిధానం 2020 కింద స్కూళ్లల్లో జాయిన్ అయ్యే పిల్లల వయస్సును నిర్ణయించినట్లు ఉత్తర్వులో పేర్కొంది.

 

ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి తాజా నిబంధనను తప్పనిసరిగా పాటించాలని స్పష్టంచేసింది. కొత్త జాతీయ విద్యా విధానం (NEP) ప్రకారం, పునాది దశలో పిల్లలందరికీ (3 నుండి 8 సంవత్సరాల మధ్య) ఐదు సంవత్సరాల అభ్యాస అవకాశాలను కలిగి ఉంటుంది, ఇందులో మూడు సంవత్సరాల ప్రీస్కూల్ విద్య(నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ) తర్వాత.. 1, 2 తరగతులు ఉంటాయి. పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా చిన్న వయస్సులో పాఠశాలలకు పంపరాదని గత ఏడాది సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది.

Related Posts

Latest News Updates