ఏపీ నూతన గవర్నర్ గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్ విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో నూతన గవర్నర్ దంపతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ ను సీఎం జగన్ శాలువాతో, బొకేతో సత్కరించారు. అనంతరం ఇంటర్నేషనల్ టెర్మినల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్దకు జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ చేరుకున్నారు.

అక్కడికి చేరుకోగానే… సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు. శాసన మండలి చైర్మన్ మోషేను రాజు, డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానుం, మంత్రి జోగి రమేష్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తదితరులు నూతన గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అక్కడి నుంచి గవర్నర్ రాజ్ భవన్ కి చేరుకున్నారు.












