రైల్వే కార్యాలయాల్లో ”బెల్” సంస్కృతి రద్దు.. ఆదర్శనీయ నిర్ణయం తీసుకున్న అశ్వనీ వైష్ణవ్

రైల్వే శాఖలో వీఐపీ సంస్కృతిని స్వస్తి పలికింది మోదీ ప్రభుత్వం. రైల్వే మంత్రిత్వ శాఖ కార్యాలయాల్లో అటెండర్లను పిలవడానికి ఉపయోగించే బెల్ సంస్కృతిని రద్దు చేయాలని, బెల్ కొట్టి అటెండర్లను పలికే పద్ధతికి స్వస్తి పలకాలని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పష్టం చేశారు. అటెండర్లను బెల్ కొట్టి పిలవొద్దని, అవసరాలు వుంటే… వ్యక్తిగతంగా ఆయా అటెండర్లను పిలవాలని అశ్వనీ వైష్ణవ్ స్పష్టం చేశారు.

 

ఈ నిబంధనను మాత్రం కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అయితే… మొదట తన కార్యాలయంలోనే బెల్ ను తొలగించి, ఆదర్శంగా నిలిచారు అశ్వనీ వైష్ణవ్. ప్రతి ఉద్యోగికీ సమానమైన గౌరవం లభించేలా చేయాలన్నదే తమ విధానమని, సంస్కృతికి స్వస్తి పలికేందుకే ఈ నిర్ణయమని స్పష్టం చేశారు. వీఐపీ కల్చర్ లేకుంటేనే… రైల్వే శాఖ బాగుంటుందని పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates