తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో ఓ సభ, నాందేడ్ వేదికగా మరో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అటు ఏపీ నుంచి, ఇటు మహారాష్ట్రాకి చెందిన కొందరు బీఆర్ఎస్ లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వారందరికీ బీఆర్ఎస్ కండువా కప్పి, పార్టీలోకి స్వాగతించారు. అయితే…. తాము దేశంలో మార్పులు రావాలని కోరుకుంటామని, అందుకే బీఆర్ఎస్ ను స్థాపించామని కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కొందరు బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బీఆర్ఎస్ కూడా కొందరు నేతల్ని పార్టీలో చేర్చుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

https://twitter.com/RaoKavitha/status/1627525102144454657?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1627525102144454657%7Ctwgr%5Ecc6fc7d352aafc2498fd3e4f3a0075c1c6ceb6c8%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Ftelangana%2Fa-fan-from-maharastra-asks-how-to-join-in-brs-party-here-is-reply-from-mlc-kavitha-975855

ఈ క్రమంలో ఓ అభిమాని, ఎమ్మెల్సీ కవితను ట్విట్టర్ వేదికగా అడిగారు. అసలు బీఆర్ఎ్ లో ఎలలా చేరాలని మహారాష్ట్రకి చెందిన సాగర్ అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవితను అడిగారు. ఆ ట్వీట్‌కు ఎమ్మెల్సీ క‌విత రిప్లై ఇచ్చారు. దేశ‌వ్యాప్తంగా జ‌రిగే ప‌బ్లిక్ మీటింగ్‌లు, ప్రోగ్రామ్‌ల్లో నేరుగా పాల్గొని సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆ అభిమానికి ఎమ్మెల్సీ క‌విత సూచించారు. కాంటాక్ట్ డిటేల్స్‌ను నేరుగా పంపాల‌ని, బీఆర్ఎస్‌లో స్వాగ‌తించేందుకు సంతోషిస్తున్నామ‌ని ఎమ్మెల్సీ క‌విత త‌న ట్వీట్‌లో తెలిపారు. రాబోయేది కిసాన్ స‌ర్కార్ అని, బీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆమె కోరారు.

 

తెలంగాణ మాదిరిగా దేశంలో కిసాన్ సర్కార్ ఏర్పడాలంటే కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమన్న ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజానీకం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితులవుతున్నారడానికి సాగర్ నిదర్శనమ‌ని కవిత తెలిపారు.