రాజకీయాల్లోకి వైఎస్ భారతి?

ఆంధ్రప్రదేశ్  లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడపలో పరిస్ధితులు ఇప్పటివరకైతే జగన్ అదుపులోనే ఉన్నాయి. అయితే వివేకా హత్య పై సీబీఐ చేస్తున్న విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటే ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా పులివెందులతో పాటు వైఎస్సార్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్ని కంచుకోటలుగా మార్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయినా పూర్తిగా అన్ని నియోజకవర్గాలపై పట్టు చిక్కడం లేదు. దీనికి ఓ బలమైన కారణముంది. వైఎస్ కుటుంబం వేరు, వైసీపీ నిలబెట్టిన ఎమ్మెల్యేలు వేరు. ఈ రెండింటికీ మధ్య ఉన్న వైరుధ్యం వైసీపీని కలవరపెడుతోంది. దీంతో వైసీపీ వ్యూహాలూ మారిపోతున్నాయి. ఇప్పటికే పులివెందులలో జగన్, కమలాపురంలో ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. దీంతో మిగిలిన నియోజకవర్గాలపై వైసీపీ దృష్టిసారిస్తోంది.

వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి చాలా ప్రతిష్టాత్మకమైంది.  జమ్మలమడుగుపై పూర్తి ఆధిపత్యం సాధించక తప్పని పరిస్ధితి వైఎస్ జగన్ కు ఎదురవుతోంది. గతంలో వైసీపీ పలుమార్లు గెలిచిన ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపైనా వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో ఆయన స్ధానంలో ఈసారి ఎన్నికల్లో తన సతీమణి వైఎస్ భారతిని ఎమ్మెల్యేగా బరిలోకి దించాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారతిని బరిలోకి దింపడం ద్వారా ఈ సీటును కూడా తమ కంచుకోటగా మార్చుకోవడంతో పాటు ఇక్కడ కడప స్టీల్ ప్లాంట్ కు ఎలాంటి ఇబ్పందులు లేకుండా చూసుకోవాలని కూడా జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే సుధీర్ రెడ్డికి మరో పదవి ఇచ్చేలా, రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చేలా జగన్ స్కెచ్ సిద్ధం చేసినట్లు సమాచారం.

Related Posts

Latest News Updates