చీతాలు మళ్లీ వచ్చేశాయి…. ఈ సారి 12 చీతాలు భారత్ కి

దక్షిణాఫ్రికా నుంచి చీతాలు మళ్లీ భారత్ కి చేరుకున్నాయి. మొదటి దశలో కొన్ని చేరుకోగా… రెండో దశ కింద నేడు 12 చీతాలు భారత్ కి వచ్చేశాయి. ఇందులో 7 మగ, 5 ఆడ చీతాలున్నాయని అధికారులు తెలిపారు., ఈ 12 చీతాలను జోహన్నెస్ బర్గ్ నుంచి సీ 17 విమానం తీసుకొచ్చింది. గ్వాలియర్ ఎయిర్ బేస్ లో ఈ విమానం ఆగింది. ఈ 12 చీతాలను శ్యోపూర్ జిల్లాలోని కునో జాతీయ పార్కుకు తరలించనున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర సింగ్ యాదవ్ వీటిని కునో నేషనల్ పార్క్ లో విడుదల చేయనున్నారు. మరోవైపు వీటి కోసం 10 క్వారంటైన్ ఎన్ క్లోజర్లను సిద్ధం చేశారు. నిబంధనల ప్రకారం వీటిని నెల రోజుల పాటు క్వారంటైన్లో వుంచనున్నారు.

 

Related Posts

Latest News Updates