రెండు తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తులు ఓం నమ :శ్శివాయ అంటూ భక్తులందరూ మహా శివుడ్ని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలన్ని ప్రముఖ శైవ క్షేత్రాలన్నింటినీ ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీశైలంతో పాటు ఏపీలోని ప్రముఖ శివాలయాల్లో భక్తుల రద్దీ ఉదయం నుంచే ప్రారంభమైంది. ఇటు తెలంగాణలో వేములవాడ, కీసరగుట్టతో సహా ఇతర దేవాలయాల్లో భక్తులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారు. అలాగే రెండు రాష్ట్రాల దేవాలయాల్లో మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. వేములవాడలో ప్రభుత్వం పక్షాన రాష్ట్ర దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించనున్నారు. 3 లక్షలకు పైగా భక్తులు ఈరోజు స్వామి వారిని దర్శించుకుంటారని అంచనా వేశారు. అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని అధికారులు ప్రకటించారు. అలాగే తెలంగాణ ఆర్టీసీ మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులను కూడా వేసింది.