ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వర రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తన క్యాంప్ కార్యాలయంలో చాగంటిని ఘనంగా సత్కరించి, వేంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు. అనంతరం సీఎం నివాసం వద్ద వున్న గోశాలను చాగంటి సందర్శించారు.

చాగంటితో పాటు శాంత బయోటెక్ వరప్రసాద రెడ్డి, కూడా వున్నారు. గోశాలను సీఎం అద్భుతంగా తీర్చిదిద్దారని చాగంటి పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సలహాదారుగా ఇటీవలే చాగంటిని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ జరిగింది.












