సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ధనుష్, సంయుక్త జంటగా నటించిన చిత్రమిది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ఈ కార్యక్రమానికి దర్శకుడు త్రివిక్రమ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రం ఈ నెల 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా బిగ్ టికెట్ ని ఆవిష్కరించారు. గురువుల గురించి సినిమా తీసిన వెంకీని అభినందిస్తున్నట్లు తెలిపారు. “గోవిందుడు, గురువు ఎదురైతే మొదటి నమస్కారం నేను ఎవరికి పెట్టాలంటే.. గోవిందుడు వీడు అని చెప్పిన గురువుకే నా మొదటి నమస్కారం పెడతానని కబీర్ అన్నాడు. అలాంటి ఎంతోమంది గురువులకి నమస్కారం చెబుతూ.. అలాంటి గురువుల గురించి సినిమా తీసిన వెంకీని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. లాక్ డౌన్ సమయంలో వెంకీ ఈ కథ చెప్పాడు. అతను చెప్పిన కథని నమ్మి ఈ సినిమా చేసిన ధనుష్ గారికి ధన్యవాదాలు. నిర్మాతల్లో ఒకరైన నా భార్య ఈ సినిమా చూసి.. కథగా విన్నప్పుడు కంటే, సినిమాగా చూసినప్పుడు ఇంకా బాగుంది అని చెప్పింది. నేను కూడా ఈ సినిమా చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి కథకి ఒక ఆత్మ ఉంటుంది. ఈ కథ తాలూకు ఆత్మ ఏంటంటే.. విద్య, వైద్యం లాంటి మౌలిక సదుపాయాలు డబ్బుతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలనేది ప్రపంచం మనకి నేర్పుతున్న పాఠం అని అన్నారు.
ఇక… హీరో ధనుష్ మాట్లాడుతూ… సార్ బలమైన భావోద్వేగాలతో కూడిన ఓ సింపుల్ సినిమా అని అన్నాడు. సందేశం, వినోదం రెండూ వుంటాయని తెలిపాడు. హైపర్ ఆది (Hyper Adi) గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ‘నిజంగా నాకు మీరు ఎందుకు ఇంత ఫేమస్ అయ్యారో తెలియదు. ఇంతకు ముందు కూడా నేను మీరు చెప్పినప్పుడు క్లాప్స్, విజిల్స్ బాగా వేశారు. ఎందుకు మీరు అంత ఫేమస్ అయ్యారో నాకు తెలియదు’, అని చెప్పాడు. లాక్ డౌన్ సమయంలో వెంకీ అట్లూరీ ఈ చిత్ర కథ వినిపించేందుకు తనను కలిశారని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు వినే మూడ్ లేదని, ముందుగా నో చెప్పడం ఎందుకు? అని విన్నానని అన్నాడు.