రేణూ దేశాయ్… సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా వుంటుంది. దాదాపుగా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూనే వుంటుంది. తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించిన సమస్యపై పోస్ట్ పెట్టింది. తాను గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నానని, త్వరలోనే కోలుకొని, సాధారణ స్థితికి వస్తానని ఆశిస్తున్నట్లు పేర్కొంది. అయితే… తన లాగా గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న వారికి ధైర్యం చెప్పడానికే చెబుతున్నానని వివరించింది. వారిలో పాజిటివిటీ నింపేందుకు చెబుతున్నానని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యాన్ని కోల్పోకూడదని పేర్కొంది. ఎప్పుడూ బలంగానే వుండాలని, జీవితంపై ఆశను కోల్పోవద్దని సూచించింది. అయితే.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని తెలిపింది.













