పుల్వామా సైనికుల త్యాగానికి నేటితో సరిగ్గా నాలుగు సంవత్సరాలు. 2019, ఫిబ్రవరి 4 న పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదులు CRPF సిబ్బంది కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో 40 మంది CRPF జవాన్లు అమరులయ్యారు. ఈ క్రూరమైన దాడి జరిగి నేటికి నాలుగు సంవత్సరాలు. ఈ సందర్భంగా జాతి యావత్తూ అమరులైన జవాన్లను గుర్తు చేసుకుంటున్నారు. నివాళులు అర్పిస్తున్నారు. పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు CRPF నివాళులు అర్పించింది.
CRPF ప్రత్యేక డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరీ నేతృత్వంలో అధికారులు, సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు పుల్వామా అమర వీరుల స్మారక చిహ్నంపై పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. భారత్ ను ఉగ్రవాద రహితంగా చేయాలన్న లక్ష్యం కోసం పనిచేయాలన్న స్ఫూర్తి వారి త్యాగాల నుంచి వస్తోందన్నారు. మా 40 మంది ధైర్యవంతులైన జవాన్లు ప్రాణాలు అర్పించారు. వారిని చూసి గర్విస్తున్నా. దేశాన్ని ఉగ్రవాద రహితంగా మార్చేందుకు వారి త్యాగం మాకు స్ఫూర్తినిస్తుంది అని పేర్కొన్నారు.
పుల్వామాలో దేశ జవాన్లపై పాకిస్తాన్ కి చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసి నేటికి సరిగ్గా 4 ఏళ్లు. మెరికల్లాంటి 40 మంది భారత జవాన్లు అమరులైన రోజు. 40 మంది జవాన్ల కుటుంబాలను పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదులు ఛిద్రం చేసిన రోజు. పుల్వామా అటాక్ జరిగిన నేటికి నాలుగేళ్లైన సందర్భంగా జాతి యావత్తూ అమర జవాన్లకు నివాళులు అర్పిస్తోంది.
పుల్వామా జిల్లాలోని లెత్ పోరా వద్ద 22 ఏళ్ల ఆత్మాహుతి బాంబర్ ఆదిల్ అహ్మద్ పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో జవాన్ల కాన్వాయ్ పై దాడి చేశాడు. దీనంతటికీ పాక్ దే బాధ్యత అని భారత్ మండిపడింది. అయితే… పాక్ ప్రేరేపిత, ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ తామే బాధ్యత వహిస్తున్నామని ప్రకటించింది. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్ కి వున్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.