పుల్వామా దాడి జరిగి నేటికి సరిగ్గా 4 సంవత్సరాలు… మోదీ ట్వీట్

పుల్వామా దాడి జరిగి నేటికి సరిగ్గా నాలుగేళ్లు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ సంస్థ జైషే మహ్మద్ ఉగ్రవాది, ఆత్మాహుతి బాంబర్ ఆదిల్ అహ్మద్ పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో జవాన్లు ప్రయాణిస్తున్న CRPF వాహనంపై దాడికి దిగాడు. దీంతో 40 మంది CRPF జవాన్లు అమరులయ్యారు. ఈ సందర్భంగా జాతి యావత్తూ…. పుల్వామా అమరులకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

”పుల్వామాలో నాలుగేళ్ల క్రితం ఇదే రోజున వీర జవాన్లను మనం కోల్పోయాం. వారి సేవలను స్మరించుకుంటున్నాను. జవాన్ల అత్యున్నత త్యాగాన్ని ఎప్పటికీ మరువలేం. భారతదేశాన్ని బలమైన శక్తిగా నిర్మించడానికి జవాన్ల ధైర్యం మనకు ఆదర్శం” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

మరోవైపు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పుల్వామాలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. అమరులైన పుల్వామ సైనికుల ధైర్యానికి, త్యాగానికి ఈ దేశం సెల్యూట్ చేస్తోందని, అమరులైన సైనికుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందని రాజ్ నాథ్ ట్వీట్ చేశారు.

Related Posts

Latest News Updates