ముంబైలో గ్రాండ్‌గా సిద్ధార్థ్‌-కియారా రిసెప్షన్‌..టాక్ ఆఫ్ ది టౌన్ గా ఈవెంట్

బాలీవుడ్‌ ప్రేమజంట కియారాఅద్వాణీ-సిద్ధార్థ్‌ మల్హోత్రా వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 7న జైసల్మేర్‌లోని సూర్యగర్హ్‌ ప్యాలేస్‌లో అంగరంగ వైభవంగా వీళ్ల పెళ్లి జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో పాటు బాలీవుడ్‌లోని పలువురు సినీ సెలబ్రెటీలు వీరి పెళ్లికి హాజరయ్యారు. కాగా ఆదివారం రోజున ఈ ప్రేమజంట గ్రాండ్‌గా రిసెప్షన్‌ నిర్వహించింది.

 

ముంబైలోని సెయింట్ రెజిస్ హోటల్‌లో రిసెప్షన్‌ ఘనంగా జరిగింది. ఈ వెడుకకు బాలీవుడ్‌ సెలబ్రెటీలు తరలి వచ్చారు. ప్రస్తుతం వీళ్లకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. అజయ్ దేవగన్, కాజోల్, వరుణ్ ధావన్, అలియా భట్, కరణ్ జోహార్, కరీనా కపూర్, దిశా పటానీ, భూమి పడ్నేకర్, విక్కీ కౌశల్, సిద్ధార్థ రాయ్, ఆకాశ్ అంబానీ, రకుల్ ప్రీత్ సింగ్, ఇషాన్ కట్టర్, రన్వీర్ సింగ్, అనుపమ ఖేర్ తదితరులు రిసెప్షన్ కి హాజరయ్యారు.

Related Posts

Latest News Updates