ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలితప్రాంతానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన గవర్నర్లను నియమించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. రామజన్మభూమి వివాద పరిష్కారంలో సుప్రీం కోర్టులో ఏర్పాటైన బెంచ్ లో అబ్దుల్ నజీర్ సభ్యుడుగా ఉన్నారు. అనంతరం ఆయన పదవీ విరమణ చేశారు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ ను చత్తీస్ గడ్ కు బదిలీ చేశారు.












