ఆస్ట్రేలియాలోని సిడ్నీలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని అర్చకులు, వేదపండితులు స్వస్తీవాచనం, విశ్వక్సేనారాధనతో ప్రారంభించారు. సుమా రు గంటన్నరపాటు జరిగిన ఈ కల్యాణోత్సవంలో ఏఈవో రఘుబాబు, అర్చకులు మంగళగిరి నరసింహమూర్తి, సురేంద్రాచార్యులు, శ్రీకాంతాచార్యులు, వేద పండితులు వేణుగోపాలాచార్యులు పాల్గొన్నారు. స్థానిక ఎంపీ, పోలీస్ కమిషనర్లు, ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్టు యాదగిరిగుట్ట ఈవో ఎన్ గీత తెలిపారు.












