నాటు నాటు పాటకి భళేగా స్టెప్పులేసిన ఆనంద్ మహింద్రా

ట్రిపుల్ ఆర్ సినిమా పాటలకి బాగా క్రేజ్ వచ్చింది. సినిమా ఎంతగా హిట్ అయ్యిందో… పాటలు కూడా అంతే స్థాయిలో హిట్ అయ్యాయి. అందులోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు ప్రపంచ ప్రఖ్యాత అవార్డులు కూడా దక్కుతూ వస్తున్నాయి. అయితే…. ఈ నాటు నాటు పాటుకు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా వుండే పారిశ్రామికవేత్త, మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర స్టెప్పులేశారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా ఈ రేసు ఈవెంట్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ లో జరిగిన ఫార్ములా ఈ రేస్ కు ఆనంద్ మహీంద్రా హాజరైన ఆనంద్ మహీంద్రా సరదాగా రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేశారు. నాటు నాటు పాటకు రామ్ చరణ్ దగ్గర బేసిక్ స్టెప్పులు నేర్చుకున్నందుకు సంతోషంగా ఉందని ఆనంద్ మహీంద్రా అన్నారు.

Related Posts

Latest News Updates