అగ్రరాజ్యంలో వుంటున్న భారత టెకీలకు అదిరిపోయే న్యూస్ ఇదీ…

హెచ్1 బీ, ఎల్ 1 వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. “డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్” ను త్వరలో పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని విభాగాల్లో ఈ విధానాన్ని ఈ ఏడాది జులై తర్వాత ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమెరికాలో లేఆఫ్స్ కి గురై, కొత్త జాబ్ కోసం అన్వేషిస్తున్న వారికి భారీ ఊరటగా చెప్పుకోవచ్చు. ఆర్థిక మాంద్యంతో ఐటీ ఉద్యోగాలకు గ్యారెంటీ లేకుండా పోయింది. దీంతో ఈ న్యూస్ కాస్త ఊరట కల్పించే విషయం. పైలట్ ప్రాజెక్టు కింద అమెరికా ఈ యేడాది చివరి నుంచి 2024 వరకు కొన్ని విభాగాలకు చెందిన నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలకు, ప్రత్యేకించి కొన్ని హెచ్-1 బీ వీసాలను రెన్యువల్, స్టాంపింగ్ చేయడం వంటివి చేస్తారు.

 

అమెరికాలో ఐటీ ఉద్యోగాలుగా విధులు నిర్వర్తిస్తున్న వారు విదేశాల్లో సైతం వీసాలను రెన్యువల్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఉద్యోగులు వారి వారి సొంత దేశాల్లో హెచ్-2బీ వీసా గడువు పొడిగించుకునేలా పాస్ పోర్టుల మీద స్టాంపింగ్ చేయించుకునే అవకాశం వుంటుంది. హెచ్1బీ వీసాదారులు గడువు ముగిసిన తర్వాత వారి స్వదేశాలకు వెళ్లి పాస్ పోర్టులపై వీసా ఎక్స్టెన్షన్ స్టాపింగ్ చేయించుకోవాల్సి వస్తోంది.

 

అయితే ఈ ప్రక్రియ అంత సులభతరం కాకపోవడంతో ఉద్యోగులతో పాటు అమెరికన్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అన్ని డాక్యుమెంట్లు సమర్పించినప్పటికీ ఒక్కోసారి వీసా, పాస్ పోర్ట్ స్టాంపింగ్ కు రెండేళ్ల వరకు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్ ప్రక్రియను పునర్ ప్రారంభించాలని అడుగుతున్నారు.

 

కరోనా సంక్షోభం నేపథ్యంలో అమెరికా వీసాలు పొందడం కష్టతరంగా మారిన విషయం తెలిసిందే. వీసా అపాయింట్‌మెంట్ల కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా..మునుపటి డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్ పథకాన్ని మళ్లీ ప్రారంభించేందుకు నిర్ణయించింది.

Related Posts

Latest News Updates