ఆనంద్ మహింద్రా, కేటీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయిన హీరో రాంచరణ్

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రాను, మంత్రి కేటీఆర్ ను హీరో రాంచరణ్ ప్రత్యేకంగా కలుసుకున్నాడు. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలోని టెక్‌ మహీంద్రా ఇన్ఫో సిటీ క్యాంపస్‌లో నిర్వహించిన మహీంద్రా ఈ-రేసింగ్ జనరేషన్‌ త్రీ కారు ప్రదర్శనలో కేటీఆర్‌, ఆనంద్‌ మహీంద్రాతో కలిసి రామ్‌ చరణ్‌ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శుక్రవారం ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, టెక్‌ మహీంద్రా సీఎండీ సీపీ గుర్నానితో సమావేశం అద్భుతంగా జరిగింది. ఫార్ములా ఈ -రేసింగ్‌లో గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా. హైదరాబాద్‌ నగరానికి ఇంతటి అద్భుతమైన కార్యక్రమాలను తీసుకువస్తున్నందుకు మంత్రి కేటీఆర్‌ గారికి ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ రామ్‌ చరణ్‌ ట్వీట్‌ చేశారు.

Related Posts

Latest News Updates